మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే

మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం ముగిసింది. వాటి తుది ఫలితాలు వెలువడేలోపు మధ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Poll) అంచనాలు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. ఓటింగ్‌కు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌పై ఇదివరకు విధించిన నిషేధాన్ని తాజాగా ఎన్నికల సంఘం సవరించింది. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నవంబర్ ఏడు నుంచి విడతల వారీగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయింది. 

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. నవంబర్‌లో వివిధ దశల్లో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంది. 

మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), గోండ్వానా గంతంత్ర పార్టీ (GGP) సంకీర్ణంగా పోటీలో ఉన్నాయి. మధ‍్యప్రదేశ్‌ ఎన్నికలపై ఎగ‍్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..? 

మధ్యప్రదేశ్ లో మొత్తం 230 సీట్లు 
116 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం

పీపుల్స్ పల్స్ సర్వే

కాంగ్రెస్-117 నుంచి 139
బీజేపీ -91 నుంచి 113
ఇతరులు- 0 నుంచి 8

న్యూస్ 18 సర్వే

బీజేపీ -112
కాంగ్రెస్- 113 
ఇతరులు- 5

సీఎన్‌ఎన్‌ సర్వే

బీజేపీ-112
కాంగ్రెస్-113
ఇతరులు-5

జన్ కీ బాత్

బీజేపీ 100 -123 కాంగ్రెస్ 102-125

రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్

బీజేపీ 118-130  కాంగ్రెస్ 97-107

TV 9 భరతవర్ష్ పోల్‌స్ట్రాట్

బీజేపీ 106 - 116 కాంగ్రెస్ 111 - 121