లాస్ ఏంజెల్స్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ కు కరోనా సోకింది. ఆయన భార్యతోపాటు పిల్లలు కూడా వైరస్ పాజిటివ్ గా తేలారు. డబ్ల్యూడబ్ల్యూఈలో డ్వేన్ జాన్సన్ ను ది రాక్ గా పిలుస్తుంటారు. తమకు కరోనా సోకిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో డ్వేన్ తెలిపాడు. పాజిటివ్ గా వచ్చిన విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానన్నాడు. తాము ఎదుర్కొన్న అత్యంత కఠిన సవాళ్లలో ఇదొకటన్నాడు. తన భార్య లారెన్ హషైన్, ఇద్దరు కూతుళ్లకు కూడా కరోనా సోకిందన్నాడు. కానీ ఇప్పుడు కోలుకున్నామని చెప్పాడు. కుటుంబ సన్నిహితుల ద్వారానే తమకు కరోనా సోకిందన్నాడు. ప్రజలు మాస్క్ తప్పకుండా కట్టుకోవాలని, ఇమ్యూనిటీని పెంచుకోవాలని సూచించాడు.
