రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారు ?

రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారు ?
  • ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్నారు
  • హైదరాబాద్ లో మోడీ సభకు జిల్లాకు లక్ష మంది చొప్పున తరలిస్తాం
  • దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు

నల్లగొండ జిల్లా: రైల్వే స్టేషన్లో రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారు ?.. ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్నారు.. అధికార పార్టీ కావాలనే చేయించినట్లు కనిపిస్తోందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఆరోపించారు. నల్గొండ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీలు, కార్యవర్గ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా భారత  ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ప్రతిపక్షాలు.. ఈ రాష్ట్ర పాలక పక్షం ప్రవర్తించిన తీరు బాధకారం అన్నారు. 
ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేల పర్యటనలలో ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేయిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. చనిపోయిన వ్యక్తి మీ టీఆర్ ఎస్ పార్టీ సొత్తా..? వేరే పార్టీ వాళ్లు రాకూడదా ? అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ డబ్బులిచ్చి కావాలని చేయించిందే ఈ ఘటన అని విమర్శించారు.  ఈ దేశానికి  సేవ చేయాలినుకునే అభ్యర్డులు ఇతరుల మాట విని తప్పు దోవ  పట్టొద్దు అని ఆయన హెచ్చరించారు. ఎంతోమంది మేధావుల ఆలోచనలు, సమీక్షల తరువాతే తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్ అన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మిలిటరీ మారుతూ ఉంటుందని.. దానికి అనుగుణంగా  నిర్ణయం  తీసుంటుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు జిల్లాకు లక్షమంది చొప్పున  తరలించడానికి అన్ని జిల్లాలలో సమావేశాలు  నిర్వహిస్తున్నామని రఘునందన్ రావు తెలిపారు.