EarthQuake: భూకంపం ధాటికి ఎయిర్‌పోర్ట్ రన్‌వే రెండు ముక్కలు

EarthQuake: భూకంపం ధాటికి ఎయిర్‌పోర్ట్ రన్‌వే రెండు ముక్కలు

టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాల ధాటికి పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే టర్కీలోని హతయ్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఎయిర్‌పోర్టులో రన్‌వే భూ ప్రకంపనల ధాటికి రెండు ముక్కలైంది. హతయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని రన్‌వే తీవ్రంగా ధ్వంసమైంది. భారీగా పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండుగా చీలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఎయిర్‌పోర్టులో ఉన్నతాధికారులు విమాన రాకపోకలను నిలిపివేశారు. భూకంప తీవ్రతకు ఒక్క టర్కీలోనే 5600లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటివరకు 4500 మందికిపైగా మృత్యువాత పడగా.. దాదాపు 20వేల మంది గాయపడ్డారు.