సైనికుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు

సైనికుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు

భారత దేశ ప్రజలు కార్గిల్ విజయం ఎప్పటికీ గుర్తించుకునే సంఘటన అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్. కార్గిల్ విజయ్ దివాస్ నేడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామ‌న్నారు. అప్పటి భారత ప్రధాని వాజపేయి సైన్యానికి ఉత్తేజాన్ని వారికి కావలసిన సహకారాన్ని అందించారన్నారు. దేశ ప్రజలను సంఘటితం చేసి ఒక్కటిగా నడిపిన కార్గిల్ సంఘటన ఇప్పటికి ప్రజలకు గుర్తే అన్నారు. దేశ ప్రజలు దేశభక్తిని పెంపొందించడం, దేశం కోసం పోరాడడం, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా చేయడాన్ని విజయ్ దివాస్ ఒక గుర్తింపును సంతరించుకున్నది అన్న విషయం వాస్తవం అన్నారు.

సైనికుల త్యాగాలను భారత దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని.. కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో చైనా కుట్ర కుతంత్రాలను భారత సైనికులు తిప్పి కొడతారన్నారు. ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలో భారతదేశం విజయం సాధిస్తుందన్నారు. సైనికులకు భారత ప్రధాని నరేంద్ర మోడికి, ప్రజలు బాసటగా నిలవాలని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రజలను కోరుతుంద‌న్నారు బండి సంజ‌య్.