టీచర్లు కావాలంటూ స్కూలుకు తాళం

టీచర్లు కావాలంటూ స్కూలుకు తాళం
  •      కురవపల్లి కొత్తూరు ప్రైమరీ స్కూల్​ ఎదుట పేరెంట్స్​ ధర్నా

అశ్వాపురం, వెలుగు:  భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని తుమ్మలచెరువు పరిధిలోని కురవపల్లి కొత్తూరు గిరిజన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సరిపడా టీచర్లు లేరంటూ తల్లిదండ్రులు మంగళవారం స్కూల్​కు తాళం వేసి ధర్నా చేశారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు 48 మంది విద్యార్థులుండగా ఒకే ఒక్క టీచర్ ​ఏం సరిపోతారని ప్రశ్నించారు.

 ఉన్నతాధికారులతో మాట్లాడి తగినంత మంది టీచర్లను నియమిస్తామని విద్యాశాఖ అధికారులు హామీ ఇవ్వడంతో పేరెంట్స్ ధర్నా విరమించారు. ఎంఈఓ వీరాస్వామి వెంటనే స్కూల్​కు వచ్చి జగ్గారం యూపీఎస్​లో  పని చేస్తున్న టీచర్​ను మంగళవారం నుంచి డిప్యుటేషన్​పై పంపిస్తామని ప్రకటించారు.