అక్టోబర్ ​28 నుండి కాంగ్రెస్ రెండో విడత బస్సుయాత్ర 

అక్టోబర్ ​28 నుండి కాంగ్రెస్ రెండో విడత బస్సుయాత్ర 

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తూనే.. మరోవైపు.. జాతీయ స్థాయి నాయకులతో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అక్టోబర్​ 28 నుండి నవంబర్ 2వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సుయాత్ర జరగనుంది. ఆరు రోజులపాటు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 17 అసెంబ్లీ స్థానాల్లో బస్సుయాత్ర కొనసాగనుంది. రెండో విడత బస్సుయాత్రలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొని... ప్రచారం చేయనున్నారు. వీరితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు. 

బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే :

ఉమ్మడి మహబూబ్​నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బస్సు యాత్రను నిర్వహించేలా పార్టీ పెద్దలు ప్లాన్ చేశారు. 

day -1
* అక్టోబర్​ 28న చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర

day -2
* అక్టోబర్​ 29న  మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర​ 

day -3
* అక్టోబర్​ 30న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని జనగాం, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర​ 

day -4
* అక్టోబర్​ 31న నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ తోపాటు కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ బస్సుయాత్ర

day -5
* నవంబర్1న నాగర్ కర్నూల్, మహబూబ్​నగర్ నియోజకవర్గాల్లోని జడ్చర్ల, షాద్ నగర్ లో బస్సుయాత్ర 

day -6
* నవంబర్2న మల్కాజ్ గిరి నియోజకవర్గంలోనని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర.

బహిరంగ సభలు సైతం.. 

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే తొలుత ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పై ఫోకస్ పెట్టి సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాత్ర నిర్వహించనున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో బస్సు యాత్రతో పాటు కొన్నిచోట్ల బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేసింది.