V6 News

వెస్టిండీస్‌‌తో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌‌.. న్యూజిలాండ్‌ ఘన విజయం

వెస్టిండీస్‌‌తో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌‌.. న్యూజిలాండ్‌ ఘన విజయం

వెల్లింగ్టన్‌‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌‌.. వెస్టిండీస్‌‌తో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో కివీస్‌‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. విండీస్‌‌ నిర్దేశించిన 56 రన్స్‌‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు శుక్రవారం మూడో రోజు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 10 ఓవర్లలో 57/1 స్కోరు చేసింది.

 టామ్‌‌ లాథమ్‌‌ (9) ఫెయిలైనా.. డేవన్‌‌ కాన్వే (28 నాటౌట్‌‌), విలియమ్సన్‌‌ (16 నాటౌట్‌‌) నిలకడగా ఆడారు. అంతకుముందు 32/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన వెస్టిండీస్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 46.2 ఓవర్లలో 128 రన్స్‌‌కు ఆలౌటైంది. కావెమ్‌‌ హోడ్జ్‌‌ (35) టాప్‌‌ స్కోరర్‌‌. జస్టిన్‌‌ గ్రీవ్స్‌‌ (25), బ్రెండన్‌‌ కింగ్‌‌ (22) మోస్తరుగా ఆడారు. 

ఇన్నింగ్స్‌‌ మొత్తంలో ఏడుగురు సింగిల్ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. జాకబ్‌‌ డఫీ (5/38), మైకేల్‌‌ రే (3/45) విండీస్‌‌ ఇన్నింగ్స్‌‌ను దెబ్బతీశారు. డఫీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య 18 నుంచి మౌంట్‌‌ మాగనుయ్‌‌లో మూడో టెస్ట్‌‌ జరుగుతుంది.