ఆశా వర్కర్ల సేవలు అమోఘం

ఆశా వర్కర్ల సేవలు అమోఘం

జనగాం/పాలకుర్తి: ఆశా వర్కర్ల సేవలు అమోఘమని, కరోనాను లెక్క చేయకుండా ప్రజల కోసం వాళ్లు చాలా కష్టపడ్డారని కొనియాడారు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బుధవారం జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్ లో  నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 520 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా సమయంలో సొంత కుటుంబాలను వదిలేసి.. ప్రజల కోసం పని చేసిన కరోనా వారియర్స్ ఆశావర్కర్లు అని అన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ ఘనత కూడా వారికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేస్తోందన్నారు.

సమైఖ్య రాష్ట్రంలో రూ.1500 గా ఉండే ఆశా వర్కర్ల జీతాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.9750 చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆశాల జీతం రూ.4 వేలు కూడా మించలేదన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత అధికారులు, ఆశా వర్కర్లు, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలు వెన్నెముక‌