స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనే కుట్టు మెషీన్లు

స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనే కుట్టు మెషీన్లు
  • ఎన్నికల ముందు రూ. 90 కోట్లతో కొనుగోలు చేసిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేశాక అమల్లోకి ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     పదినెలలుగా స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :   మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న కుట్టుమెషీన్లు పది నెలలుగా స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోనే మూలుగుతున్నాయి. మైనార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుట్టు మెషీన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ లోగా ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో పంపిణీ ఆగిపోయింది. దీంతో వందలాది కుట్టుమెషీన్లు ఆర్డీవో, ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోనే మూలుగుతున్నాయి.

రూ. 90 నుంచి రూ. 100 కోట్ల ఖర్చు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది పేద మైనార్టీ మహిళలకు కుట్టుమెషీన్లు పంపిణీ చేయాలని గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అప్లికేషన్లు తీసుకొని, అర్హులైన వారిని ఎంపిక చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసర్లను ఆదేశించింది. అనంతరం నియోజకవర్గానికి వంద చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో పంపిణీ చేసేందుకు రూ. 90 నుంచి రూ. 100 కోట్లు ఖర్చు చేసి కుట్టుమెషీన్లను కొనుగోలు చేసింది. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లాలకు చేరవేసింది. ఆఫీసర్లు లబ్ధిదారులను గుర్తించిన అనంతరం అప్పటి అధికార బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు కుట్టుమెషీన్ల పంపిణీని ప్రారంభించారు. ఈ టైంలోనే ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50కిపైగా నియోజకవర్గాల్లో మెషీన్ల పంపిణీ జరగలేదని మైనార్టీ సంఘాల నేతలు చెబుతున్నారు. 

భద్రాది జిల్లాలో ఒకే నియోజకవర్గంలో పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 500 కుట్టుమెషీన్లు వచ్చాయి. వీటిని మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసర్లు గతంలోనే ఆయా నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. మెషీన్లు వచ్చిన ఒకటి, రెండు రోజుల్లోనే అప్పటి పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​రేగా కాంతారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తర్వాత ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి రావడంతో కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కుట్టుమెషీన్ల పంపిణీ ఆగిపోయింది. కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన కుట్టుమెషీన్లు స్థానిక ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన మెషీన్లు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని స్టోర్​ రూంలలో భద్రపరిచారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వమైనా స్పందించి కుట్టుమెషీన్లను పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

లబ్దిదారులకు పంపిణీ చేయాలి  

పది నెలలుగా స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మూలుగుతున్న మెషీన్లను అర్హులైన వారికి పంపిణీ చేయాలి. లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు తర్వాత ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో పంపిణీని నిలిపివేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వమైనా మెషీన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలి.

-యాకూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాషా, మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రికొత్తగూడెం