మొదలైన సముద్రఖని..ధనరాజ్ మూవీ.. తండ్రీ కొడుకుల బంధంతో మరో బలగం!

మొదలైన సముద్రఖని..ధనరాజ్ మూవీ.. తండ్రీ కొడుకుల బంధంతో మరో బలగం!

సముద్రఖని (Samuthirakani) లీడ్‌‌ రోల్‌‌లో నటుడు ధనరాజ్(Dhanraj) తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తండ్రి కొడుకుల ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.

తండ్రి కొడుకుల ఎమోషన్ తో చాలా సినిమాలు వచ్చినప్పటికీ..ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని పాయింట్ తో ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు ధనరాజ్. ఈ చిత్రంతో సముద్రఖని నుంచి మరో విభిన్నమైన పాత్రను చూడబోతున్నట్లు..తప్పకుండ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ మూవీలో మోక్ష, హరీష్ ఉత్తమన్, పృథ్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా విమానం మూవీతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మాటలు సమకూరుస్తూన్నారు.

సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dhanraj (@yoursdhanraj)