
- పీపీపీ పద్ధతిలో ఏర్పాటు
- 17 రంగాల్లో కోర్సులు.. ఏటా 20 వేల మందికి శిక్షణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంగళవారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ బిల్–2024’ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. పీపీపీ పద్ధతిలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. 17 రంగాల్లో కోర్సులు ప్రవేశపెట్టి, ఏటా దాదాపు 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల్లో నైపుణ్య కేంద్రాలు (స్కిల్ సెంటర్లు/స్పోక్స్) ఏర్పాటు చేయనున్నారు. వాటికి అనుబంధంగా వేర్వేరు కాలేజీలనూ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ యూనివర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.