63 అంతస్తులతో స్కైవెన్ ప్రాజెక్ట్

63 అంతస్తులతో స్కైవెన్ ప్రాజెక్ట్

హైదరాబాద్​, వెలుగు: ఈ-ఇన్​ఫ్రా, పింగ్లే వెంచర్స్ అండ్ రియాల్టీ (పీవీఆర్) సంస్థలు 'ది స్కైవెన్' పేరుతో 63 అంతస్తుల నివాస భవనాన్ని ప్రారంభించాయి.   రెండెకరాల్లో 233 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్కై విల్లాలు, నాలుగు బెడ్​రూమ్స్​ ఇళ్లు అందుబాటులో ఉంటాయి.  

ఈ ప్రాజెక్టులో నివాసితులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తున్నట్లు ఈ-ఇన్ఫ్రా భాగస్వామి రమేష్ రెడ్డి  తెలిపారు. భవనంపై భాగంలో రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్ క్లబ్, ఇన్ఫినిటీ పూల్, నక్షత్రశాల, స్పా, వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ సెంటర్​ హెలిప్యాడ్ కల్పిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్​ధర రూ.6.23 కోట్ల నుంచి మొదలవుతుంది. 2030 నుంచి డెలివరీలు మొదలవుతాయి.