‘గ్రహణం’ ఎఫెక్ట్..మునుగోడులో పార్టీల ఇంటర్నల్ మీటింగ్స్

‘గ్రహణం’ ఎఫెక్ట్..మునుగోడులో పార్టీల ఇంటర్నల్  మీటింగ్స్

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంపై సూర్య గ్రహణం ఎఫెక్ట్ పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలంతా ప్రచారాన్ని ఆపేసి ఇంటర్నల్ మీటింగ్స్ తో బిజీ అయ్యారు. మర్రిగూడ బీజేపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో  సమావేశం అయ్యారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ప్రచారాన్ని నిలిపేసి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. 

ఇక జ్వరంతో బాధపడుతున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో రెస్ట్ తీసుకుంటున్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. ఉదయం నుంచి చండూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. లంచ్ టైంలో సొంత గ్రామం ఇడికుడకు వెళ్లిపోయారు.