
ఓ వైపు కరోనా మనుషుల్ని అల్లకల్లోలం చేస్తుంటే.. మరో వైపు బ్లాక్ ఫంగస్ భయాందోళనకు గురి చేస్తుంది. కొందరు ఇంట్లో పెద్దలకు వ్యాది సోకితే పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు వృద్ధులు ఒంటరవుతున్నారు. ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నాయని వదిలేశాడు ఓ కొడుకు. రుక్కుంపల్లికి చెందిన చంద్రయ్య (63)కు ఈ నెల 3న కరోనా పాజిటివ్ వచ్చింది. తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత నిన్న బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. కన్ను, నుదుటి భాగంలో వాపు వచ్చింది. దీంతో తన వల్ల కాదంటూ తండ్రిని వదిలేసి వెళ్లిపోయాడు కొడుకు. దీంతో చంద్రయ్య పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలోనే పడిగాపులుగాస్తున్నాడు.