10న రాష్ట్ర కేబినెట్ భేటీ...కీలకాంశాలపై చర్చ

10న రాష్ట్ర కేబినెట్ భేటీ...కీలకాంశాలపై చర్చ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు  నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు సహా పలు అంశాలపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. ఎన్నికలకు మరో ఏడాదే గడువు ఉండడంతో అన్ని వర్గాలకు చేరువయ్యే అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

 

సీబీఐ, ఈడీ, ఐటీ కేసులపై విపక్షాలతో కలిసి ఆందోళనలు

మరోవైపు ఎల్లుండి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రతిపక్షాలు చేసే ధర్నాలకు అంశాల వారీగా మద్దుతివ్వనుంది. సీబీఐ, ఈడీ, ఐటీ సోదాలు, కేసులపై విపక్షాలతో కలిసి ఆందోళనలు నిర్వహించనుంది. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు వ్యూహా రచన చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.