త‌గ్గిన టెస్టింగ్ సెంట‌ర్లు.. పెరుగుతున్న క‌రోనా అనుమానితులు

త‌గ్గిన టెస్టింగ్ సెంట‌ర్లు.. పెరుగుతున్న క‌రోనా అనుమానితులు
  • ఒక్కో సెం టర్ లో 250 శాంపిల్స్ మాత్రమే కలెక్షన్
  • ప్రైవేట్ కు పెరుగుతున్న తాకిడి
  • ఎక్కు వ టెస్ట్​లు చేస్తే ఊరుకోని అధికారులు

కరోనా టెస్టులు పెంచుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సిటీలో టెస్టిం గ్ సెంటర్లు తగ్గిస్తోంది. గ్రేటర్ లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నా, పట్టనట్టు వ్యవహరిస్తోంది. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జియాగూ డ, అంబర్ పేట, మలక్ పేట, గోల్కొం డ ఏరియా హాస్పిటల్స్ లో టెస్ట్​లు బంద్ పెట్టిం ది. జీహెచ్​ఎంసీ పరిధిలో డైలీ 800కిపైగా కేసులు నమోదవుతుండగా, ఒక్కో పాజిటివ్ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్​లు కనీసం ముగ్గు రికి టెస్టులు చేయాల్సి ఉంటుంది. అలా 2,500కి పైగా టెస్ట్​ చేయాల్సి ఉండగా, వెయ్యి లోపే శాంపి ల్స్ తీసుకుంటున్నారు. దాంతో చాలామంది ప్రైవేట్ లో చేయించుకుంటున్నారు. పేదలు రోజులతరబడి ప్రభుత్వ సెంటర్లకు తిరుగుతున్నారు.

ఎక్కడున్నయో తెలియట్లే 

సిటీలో టెస్టిం గ్ సెంటర్లు ఎక్కడున్నాయో చాలామందికి తెలియడం లేదు. ఉన్నవాటిని తీసేసిన విషయమూ మెడికల్ ఆఫీసర్లు వెల్లడించడం లేదు. ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారనేది కూడా చెప్పలేకపోతున్నారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద హాస్పిటల్ కు బుధవారం ఉదయం 7 గంటల నుంచే వందల్లో సస్పెక్టర్స్ క్యూ కట్టారు . కరోనా డ్యూటీలో ఉన్న అధికారుల శాంపి ళ్లు ముందుగా తీసుకుని, ఆ తర్వాత ఇతరులవి కొందరివి మాత్రమే తీసుకున్నారు. మిగిలిన వాళ్లను రేపు రమ్మని పంపేశారు. అన్ని సెంటర్ల దగ్గరా ఇదే పరిస్థితి ఉంది.

40 ఏండ్లు దాటినోళ్లకే టోకెన్లు

క్యూ​లో ఎంతమంది ఉన్నా ఒక్కో సెంటర్ లో 200– 250 శాంపి ల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. 40 ఏళ్లు దాటిన వారికే టోకెన్లు ఇస్తున్నారు. యువకుల శాంపి ల్స్ పెద్దగా పట్టిం చుకోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేదం హాస్సిటల్ కి రెం డ్రోజులు వెళ్లినా శాంపి ల్ తీసుకోకపోవడంతో ప్రైవేట్ లో టెస్ట్​ చేయించుకున్నట్లు బోరబండకు చెందిన రాజేష్ తెలిపాడు.

ప్రైవేట్ సెంటర్లూ క్లోజ్

సిటీలోని 18 ప్రైవేట్ సెం టర్లకూ అనుమానితులు క్యూ కడుతున్నారు. అక్కడా లోడ్ పెరగడంతో ఓ డయాగ్నస్టి క్ బుధవారం నుంచి 5వ తేదీకి శాంపి ల్స్ కలెక్షన్ బంద్ పెట్టిం ది. మరో సెంటర్ మిషన్  ట్రబుల్ ఇవ్వడంతో ఆపేసింది. ఎక్కువ టెస్టులు చేస్తే ఉన్నతాధికారులు ఫైర్ అవుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ సెంటర్ లో టెస్ట్​లు ఎక్కువ చేసినందుకు ఉన్నతాధికారి ఒకరు సీరియస్​ అయి, తగ్గిం చాలని చెప్పి నట్లు సమాచారం.

జియాగూడలో మళ్లీ పెట్టాలె

జియాగూడలో వందల కేసులు వస్తుంటే టెస్టిం గ్ సెంటర్ తీసేశారు. అనుమానితులంతా ఎక్కడికి పోవాలె. టెస్ట్​లు పెంచుతామన్న ప్రభుత్వం ఉన్న సెంటర్లు తీయడమేంది. జియాగూడ సెంటర్ ను తిరిగి ప్రారంభించాలె. ‑ ప్రవీణ్ కు మార్, జియాగూడ

మంత్రికి కంప్లయింట్ చేసినా..

అంబర్ పేటలో మొన్నటి దాకా ఉన్న శాంపి ల్ కలెక్షన్ సెం టర్ ను బంద్ చేశారు. ఇక్కడ వందల్లో పాజిటివ్ కేసులున్నాయి. ఫీవర్ ఆస్పత్రికి పోతే పట్టిం చుకోవడం లేదు. కింగ్ కోఠికి వెళ్తే కుదరదంటున్నారు. మంత్రి ఈటల రాజేందర్ కు ఫోన్ లో నాలుగు సార్లు చెప్పి నా ఫలితం లేదు.
‑ బి.దీపక్ కుమార్, ఆర్ డీఏ టాస్క్​ఫోర్ట్ తెలంగాణ