ఈ నెల 24నే దీపావళి.. సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ఈ నెల 24నే దీపావళి.. సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

దీపావళి పండుగపై ప్రజల్లో నెలకొన్న అయోమయానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈనెల 24న దీపావళి సెలవు ప్రకటిస్తూ సర్కార్​ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెలవు 25న ఉంటుందా లేక 24న ఉంటుందా అన్న అయోమయానికి తెరపడింది. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న దీపావళి వస్తుంది. కానీ ఆ రోజు సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఆ రోజు అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని, అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి అందుకే పండుగ జరుపుకోవడం సరికాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 24న రాతంత్రా అమావాస్య గడియలు ఉంటాయి అందుకే ఆ రోజే పండుగ జరుపుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. 24న ఉదయం చతుర్దశి ఉంటుందని, రాతంత్రా అమవాస్య కొనసాగుతుందని చెబుతున్నారు. 

24న లక్ష్మీదేవికి పూజ చేసి రాత్రి టపాసులు పేల్చి పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం 25న పండుగ ఉండటం, పండితులు 24న జరుపుకోవాలని సూచిస్తుండటంతో.. దీపావళి పండుగ తేదీలపై నెలకొన్న అయోమయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 24న దీపావళి పండుగ సెలవు ప్రకటించింది.