ఎస్సారెస్పీ గేట్ల రిపేర్​కు 17 కోట్లు

ఎస్సారెస్పీ గేట్ల రిపేర్​కు 17 కోట్లు

హైదరాబాద్‌, వెలుగు: ఎస్సారెస్పీ గేట్ల రిపేర్లు, మెయింటనెన్స్‌ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17.40 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాజెక్టు 36 గేట్ల వైర్లు, స్టాప్‌ లాగ్‌ గేట్ల రిపేర్, రోలార్‌ బేరింగ్‌లు, గేర్‌ బాక్స్‌ల రిపేర్, రీప్లేస్‌మెంట్‌, హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వరద కాలువ వరకు పెయింటింగ్‌ తదితర పనులు చేపట్టేందుకు ఈ మొత్తం శాంక్షన్‌ చేశారు.

డిండి పర్యావరణ స్టడీ బాధ్యతలు ఈపీటీఆర్‌ఐకి

ఏఎమ్మార్‌ ఎస్‌ఎల్బీసీలో భాగంగా నిర్మిస్తున్న డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పర్యావరణ అనుమతుల కోసం రిపోర్ట్‌ తయారు చేసే బాధ్యతను ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ)కి ప్రభుత్వం అప్పగించింది. నివేదిక రూపొందించేందుకు రూ.3.49 కోట్లతో టెండర్లు పిలవగా జీఎస్టీ కలుపుకొని 18 శాతం తక్కువకు ఈపీటీఆర్‌ఐ బిడ్‌ దాఖలు చేసింది. ఆ సంస్థకు నామినేషన్‌ పద్ధతిన టెండర్‌ అప్పగించారు. కాగా, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా 2015లో రూ.519.42 కోట్లతో ఈ రిజర్వాయర్‌ పనులు చేపట్టారు. 2019లో రూ.1,147 కోట్లకు అంచనాలు సవరించారు. రిజర్వాయర్‌కు తుది దశ పర్యావరణ అనుమతుల కోసం ఈ నివేదిక రూపొందించి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు సమర్పించనున్నారు.