కేంద్రం నుంచి సాయం అందకపోవడానికి కేసీఆరే కారణం

కేంద్రం నుంచి సాయం అందకపోవడానికి కేసీఆరే కారణం
  • 8 ఏళ్లుగా పంట నష్టం జరుగుతున్నా పసల్ బీమా, ఇన్సూరెన్స్ సబ్సిడీ రావట్లే
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

వర్షాలు, వరదలతో రాష్ట్రం  అతలాకుతులం  అవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ  పర్యటన ఏంటని  ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ   జీవన్ రెడ్డి. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో లక్షల ఎకరాల  పంట నష్టం  జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నిధులు  తీసుకొచ్చే  ప్రయత్నం కూడా  కేసీఆర్ చేయట్లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  మండిపడ్డారు. 
రాష్ట్రంలో 8 ఏళ్లుగా  పంట నష్టం జరుగుతుంటే..  పసల్ బీమా,  ఇన్సూరెన్స్  సబ్సీడీ అందడంలేదన్నారు. కేంద్రం నుంచి  ఆర్థిక సాయం పొందకపోవడానికి  సీఎం కేసీఆర్ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల  కక్కుర్తి వల్లే  కాళేశ్వరానికి జాతీయ హోదా  రాలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.