ఉద్యోగుల రెగ్యులరైజ్ ​పై..కౌన్సిల్ మీటింగ్ లో తీర్మానం పెట్టాలి

ఉద్యోగుల రెగ్యులరైజ్ ​పై..కౌన్సిల్ మీటింగ్ లో తీర్మానం పెట్టాలి
  • మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్

హైదరాబాద్/జీడిమెట్ల, వెలుగు : తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ బల్దియా కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగింది. మంగళవారం ఎల్​బీనగర్, ఉప్పల్, అబిడ్స్, శేరిలింగంపల్లి, కాప్రా, చార్మినార్, మొఘల్ పురా, ఆర్కేపురం, చందానగర్, కూకట్​పల్లి ప్రాంతాల్లో కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఇయ్యాల్టి నుంచి లైట్ వెహికల్స్ డ్రైవర్లు  సైతంసమ్మెలో పాల్గొననున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇయ్యాల జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్  మీటింగ్ లో ఉద్యోగుల రెగ్యులరైజ్​పై తీర్మానంప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపాలని కోరారు.

కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీసు ముందు శానిటేషన్ కార్మికులు చేపట్టిన ధర్నాలో బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి పాల్గొన్నారు. కార్మికులకు సంఘీభావం తెలిపారు. మేకలమండిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన దీక్షకు పీసీసీ జనరల్ సెక్రటరీ కోట నీలిమ హాజరై మద్దతు తెలిపారు.