రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

 

  •     ఇటీవల ఎండదెబ్బకు ఫారెస్ట్ ఆఫీసర్ మృతి 
  •     ఏటా వందల సంఖ్యలో మరణాలు
  •     ఈసారి మరింత ప్రమాదకరంగా పరిస్థితి 
  •     జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు దంచుతున్నయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నయి. దీంతో బయటకు పోవాలంటేనే జనం జంకుతున్నరు. ఏప్రిల్, మే నెలలో ఉండే వడదెబ్బ కేసులు మార్చిలోనే నమోదవుతున్నయి. మంచిర్యాల్ జిల్లా జన్నారంలో ఇటీవల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒకరు వడదెబ్బ కొట్టి చనిపోయారు. కరీంనగర్‌‌‌‌ జిల్లాలో రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి రోడ్డు మీదే సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయం 10, 11 గంటల నుంచే ఎండలు దంచుతుండడంతో జనాలు వడదెబ్బ బారిన పడుతున్నరు. ఇప్పటికే ఒకసారి వాతావరణ శాఖ హీట్‌‌ వేవ్‌‌ అలర్ట్ కూడా జారీ చేసింది. హోలీ పండుగ నాడు, ఆ తెల్లారి రోజు ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. కోల్‌‌ మైన్స్‌‌ విస్తరించి ఉన్న బెల్లంపల్లి, మంథని, గోదావరిఖని, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో వేడి విపరీతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌‌గా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.