కేంద్రానికి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు

కేంద్రానికి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు జడ్జీలను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజి యం నిర్ణయం తీసుకుంది. గురు వారం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నేతృ త్వంలో జరిగిన మీటింగ్​లో కేంద్రా నికి కొలీజియం సిఫార్సులు చేసింది. తెలంగాణ, మద్రాస్, ఏపీ హైకోర్టుల నుంచి మొత్తం ఏడుగురు జడ్జీల బదిలీపై కొలీజియం సిఫార్సులు చేసింది.

ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ లలితను కర్నాటక హైకోర్టుకు, జస్టిస్ నాగార్జున్​ను మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేసింది. ఏపీ హైకో ర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్​ను  మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేశ్​ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ వేలుమణిని కోల్​కతా హైకోర్టుకు, జస్టిస్ రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేసింది.