నేతలపై క్రిమినల్ కేసుల విచారణపై సుప్రీం కీలక నిర్ణయం

నేతలపై క్రిమినల్ కేసుల విచారణపై సుప్రీం కీలక నిర్ణయం
  • ఈనెల 15 తర్వాత వాదనలు వినేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశంలోని  ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీ తర్వాత వాదనలు వినేందుకు అంగీకరించింది సుప్రీంకోర్టు. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై రెండు వేలకుపైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ సీజేఐ  ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా. ప్రజా ప్రతినిధులపై కేసుల వ్యవహారంలో విజయ్ హన్సారియా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి

ఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?

మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి

రివ్యూ: గని

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్