ఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?

ఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?

కొమురంభీం జిల్లా: దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వడ్ల సమస్యలేదు.. ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రైతులకు ఎన్నో చేస్తున్నామని గొప్పలు చెప్తున్న సీఎం కేసీఆర్.. వడ్లను ఎందుకు కొనవు? అని ప్రశ్నించారు. పల్లెల్లో ఎక్కడికిపోయినా సుఖం లేదని ఆయన పేర్కొన్నారు. కొమురంభీం జిల్లాలో బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు చేస్తున్న పాదయాత్ర శుక్రవారం 6వ రోజుకు చేరుకుంది. ఇవాళ పాదయాత్ర తుమ్మిడిహెట్టిలో జరిగే ముగింపు సభకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. కాగజ్ నగర్ చెక్ పోస్టు దగ్గర ఈటల రాజేందర్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. 
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పొడుభూములపై ఇబ్బందులు పడుతున్నామని కేసీఆర్ కి ఎమ్మెల్యేలే స్వయంగా చెప్తున్నారని అన్నారు. గిరిజనుల కుటుంబాల్లో కేసీఆర్ మట్టిగొట్టారని, అధికారపార్టీ నేతలను జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ ది అన్నారు.  పెన్షన్ల కోసం ఎదురు చూసి చూసి ఎంతోమంది వృద్ధులు చనిపోయారు..నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్లు ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్లలో వేలకోట్లు ఖర్చు చేసినా చుక్కనీరు రాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద పూర్తి చేసిన కేసీఆర్.. ప్రాణహిత చేవెళ్ల వైపు ఎందుకు చూడటం లేదు అని నిలదీశారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. హుజూరాబాద్ లో గెలుపుకోసం కేసీఆర్ చేయని ప్రయత్నం లేదని.. యావత్ తెలంగాణ ప్రజలు హుజురాబాద్ ఫలితాన్ని కోరుకుంటున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి

రివ్యూ: గని

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్