1,032 టీచర్ పోస్టులు ఖాళీ

1,032 టీచర్ పోస్టులు ఖాళీ

సర్కారీ స్కూళ్లలో మౌళిక సదుపాయాలు లేకపోవడంతో పాటు టీచర్‌ పోస్టుల ఖాళీలపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో సుప్రీంకోర్టు స్పందించి తెలుగు రాష్ట్రాల్లో టీచర్‌ పోస్టుల ఖాళీలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో 1,032 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వీటిలో 915 ఎస్జీటీ పోస్టులున్నా యి. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా సర్కారీ స్కూళ్లలో పూర్తి స్థాయిలో టీచర్లు లేరు. జిల్లా లో అత్యధిక స్కూళ్లు విద్యావలంటీర్లతోనే కాలం నెట్టుకొస్తున్నాయి. ఇటీవల టీఆర్టీ‌‌2017 ద్వారా కొన్ని స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా భారీగానే ఖాళీలున్నా యి. అయితే కోర్టు ఆదేశాలతో ఖాళీల భర్తీకి మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోర్టు వివాదాలతో ఎస్జీటీకి బ్రేక్‌
కోర్టు వివాదాల నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులు భర్తీ కాలేదు. ఉమ్మడి జిల్లా లో మొత్తం 1,269 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టీఎస్ పీఎస్సీ ( తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నియామక ప్రకటన విడుదల చేసిం ది. అయితే ఇందులో 915 ఎస్ టీ పోస్టులకు సంబంధించి న్యా యపరమైన వివాదాలు రావడంతో భర్తీ ప్రక్రియకు బ్రేక్​ పడిం ది. 354 స్కూల్‌ అసిస్టెంట్ పోస్టుల్లో 251 పోస్టులు భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయితే ఇందులో 14 మంది పోస్టింగ్‌లు తీసుకోలేదు. ఉపాధ్యాయ నియామకాల్లో ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు తొలి ప్రాధాన్యమిచ్చారు. కనీసం ఒక్క టీచర్‌ కూడా లేని పాఠశాలలను గుర్తించి అక్కడ టీచర్ ను నియమించారు. బాలికల పాఠశాలల్లో మహిళా టీచర్లకు పోస్టింగ్‌ ఇచ్చారు. టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థుల్లో ఎక్కువగా వికారాబాద్‌ జిల్లా కు పోస్టిం గ్‌ ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాతిపదికన జరిగిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకాల్లో 251 మందిని ఎంపిక చేయగా 237 మంది మాత్రమే పోస్టింగ్‌లు తీసుకున్నారు . వికారాబాద్‌ జిల్లా లో 187 మంది, రంగారెడ్డి జిల్లా లో 45 మంది, మేడ్చల్‌లో 5 మంది, గండీడ్‌, కుల్కచర్లలో 21 మందికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,032 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు వివరిస్తున్నారు .

మౌలిక సదుపాయాలపైనా..
సర్కారీ స్కూళ్లలో మౌళిక సదుపాయాలపై వివరాలు సేకరిస్తున్నారు . తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు విద్యార్థులకు సరిపోయే విధంగా ఉన్నాయా.. లేవా అనే విషయాలను పరిశీలిస్తున్నారు . ఇప్పటికే జిల్లా లోని స్కూళ్లకు మరుగుదొడ్లను మంజూరు చేశారు. కానీ నిర్మాణాలు పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారు . ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో 350 మరుగుదొడ్లు మంజూరు చేస్తే 23 మాత్రమే పూర్తి చేయగా 98 నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఏయే వసతులు అవసరమో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు .