ఆపరేషన్ గంగ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రశంసలు

ఆపరేషన్ గంగ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రశంసలు
  • భారతీయుల తరలింపు, సాయం కోసం హెల్ప్ డెస్క్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని ప్రశంసించింది సుప్రీం కోర్టు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గొప్ప చర్యలు చేపట్టిందని సంతృప్తిని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. భారతీయుల తరలింపు, సాయం కోసం హెల్ప్ డెస్కు ఏర్పాటు చేయాలన్న పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు బాధపై ఆందోళన వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కోసం ఆందోళనలు వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని,  ఇప్పటివరకు 17 వేల మందిని ఉక్రెయిన్ సరిహద్దులు దాటించినట్టు వివరించారు అటార్నీ జనరల్ వేణుగోపాల్. ముఖ్యంగా ఉక్రెయిన్ లో చదువుతున్న వేలాది మంది వైద్య విద్యార్థుల తరలింపులో ఏజీ వేణుగోపాల్ కృషి చేశారంది సుప్రీం కోర్టు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి తరలింపులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.