జీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు 

జీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1 కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జీఓ ఆర్టీ నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేయబడింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ చంద్రచూడ్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించగా.. ఏప్రిల్ 24న విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే... ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరిస్తే.. పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో రోడ్ల పక్కన బహిరంగ సభలను నిర్వహించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O. Rt No.1 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ జీవోపై వెకేషన్ బెంచ్ స్టే ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి బెంచ్ స్టేను ఎత్తివేసి, వెకేషన్ బెంచ్ దాని పరిమితులను మించిపోయిందని తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. తీర్పు ఆలస్యం కావడంతో పిటిషనర్  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు.. జీఓ నంబర్ 1పై పిటిషన్‌ విచారణ చేపట్టనుంది.