ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేత.. ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల!

ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేత.. ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల!

గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆదివారం (అక్టోబర్​ 22న) బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్​ లిస్ట్​ జాబితా వెలువడే చాన్స్​ ఉంది. ఈ క్రమంలో బీజేపీ మొదటి జాబితాలో రాజాసింగ్​పేరు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. గోషామహల్ సీటును రాజాసింగ్​కే ఇచ్చే అవకాశం ఉంది. 

గతంలో‌ రాజాసింగ్కు బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీంతో రాజాసింగ్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన అధిష్టానంపై తాజాగా ఆయనపై సస్పెన్షన్​ఎత్తివేసింది. 2022, ఆగస్టు 23న‌ రాజాసింగ్పై సస్పెన్షన్ విధించింది. 14 నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసింది. 

మరోవైపు.. గోషామహల్​సీటును మాజీ మంత్రి ముఖేష్​గౌడ్​కుమారుడు విక్రమ్​గౌడ్ ఆశిస్తున్నారు. రాజాసింగ్ కు గోషామహల్​ టికెట్​ఇస్తే విక్రమ్​ గౌడ్​ పరిస్థితి ఏంటన్నదానిపై బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. విక్రమ్​ కు మరో స్థానంలో సీటు ఇస్తారా..? లేక ఆయన్ను పక్కన పెడుతారా..? అనే చర్చ సాగుతోంది. 

Also Read :- భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువు తారుమారు

మొత్తంగా అందరూ అనుకున్నట్లుగానే.. ఊహించినట్లుగానే రాజాసింగ్​పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్​వేటు ఎత్తివేసింది. దీంతో ఆయన అభిమానులు, అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఆదివారం (అక్టోబర్​ 22న) ఏ క్షణంలో అయినా బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.