10 భాషల్లో టెట్​

10 భాషల్లో టెట్​
  • సోషల్ స్టడీస్​కు 1,28,574 దరఖాస్తులు
  • పేపర్ 2 కోసం 2,77,884 అప్లికేషన్లు

హైదరాబాద్,వెలుగు : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్​(టెట్)కు ఈ సారి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే పేపవర్ 1, పేపర్ 2లో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్ 1 అందరికీ కామన్ గా ఉంటుండగా.. పేపర్ 2లో మాత్రం మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజ్ పండిట్స్ కు వేర్వురుగా ఉంటాయి. ఈ సారి పరీక్ష రాసే వారి సంఖ్య పెరగడంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 12న జరిగే టెట్ పరీక్షకు 6,29,352  అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లో పేపర్ 1 కోసం 3,51,468 , పేపర్​ 2 కోసం 2,77,884 దరఖాస్తులు అందాయి. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్టుకు చెందిన అభ్యర్థులు 1,49,310 మంది, సోషల్ స్టడీస్, లాంగ్వేజీ పండిట్ ​కేటగిరీలో 1,28,574 మంది అప్లై చేశారు. అయితే 2017లో జరిగిన టెట్​లో మ్యాథ్స్, సైన్స్ పేపర్​ రాసిన ​అభ్యర్థుల కంటే సోషల్, లాంగ్వేజీ పండిట్​ పేపర్​ రాసిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ సారి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాసే అభ్యర్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు టెట్ నిర్వహణ కోసం సెంటర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 1500లకు పైగా సెంటర్లను గుర్తించారు. ఆ సెంటర్లలో డ్యూటీ చేసేందుకు నాన్ టీచింగ్ సిబ్బంది కోసం వెతుకుతున్నారు. ఆయా జిల్లాల్లో అభ్యర్థులకు అనుగుణంగా సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. 

పలు భాషల్లో పరీక్ష నిర్వహణ
ఈ సారి టెట్​ను పది భాషల్లో నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వనున్నారు. అంటే ఒకే పేపర్​లో తెలుగు/ఇంగ్లీష్, తెలుగు/ సంస్కృతం, ఇంగ్లీష్​/ఉర్దూ... ఇలా రెండు లాంగ్వేజీల్లో క్వశ్చన్లుంటాయి. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతి, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు, సంస్కృతం భాషల్లో టెట్ నిర్వహించనున్నారు. తెలుగు/ఇంగ్లీష్​లో అత్యధికంగా 5,71,986 మంది రాయనుండగా, దీంట్లో పేపర్ 1లో 3,26,288 మంది, పేపర్​ 2లో 2,45,698 మంది ఉన్నారు. ఇంగ్లీష్​/హిందీలో మొత్తం 31,058 మంది, ఇంగ్లీష్​/ఉర్దూలో 25,108 మంది రాయనున్నారు. బెంగాలీ/ఇంగ్లిష్​లో 13 మంది, గుజరాతి/మరాఠీలో ఇద్దరు, కన్నడ/ఇంగ్లీష్​లో 617, ఇంగ్లీష్​/ మరాఠీలో 416 మంది, ఇంగ్లీష్​/తమిళ్​లో 54 మంది, తెలుగు/ సంస్కృతంలో 98 మంది రాయనున్నారు. దీనికి సంబంధించిన పేపర్ల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.