స్కూల్ ఫీజులు పెంచకూడదని ప్రభుత్వం ఆదేశం

స్కూల్ ఫీజులు పెంచకూడదని ప్రభుత్వం ఆదేశం

ఈ ఏడాది విద్యా సంవత్సరానికి స్కూల్ ఫీజులు పెంచకూడదని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన జీవో నంబర్ 75 ను జారీ చేసింది. స్టేట్ బోర్డు,CBSE, ICS తో పాటు ఇతర అంతర్జాతీయ బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ గుర్తింపు పొందిన స్కూళ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. తమనుంచి ఆర్డర్లు వచ్చేవరకు నెలవారీ ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వ కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా. జీవో నెంబర్ 46 ను కొనసాగిస్తూ జీవో నెంబర్ 75 ను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో నంబర్46 ప్రకారం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశాలున్నాయి. లాస్ట్ ఈయర్ కూడా జీవో నెంబర్ 46 జారీ చేసింది ప్రభుత్వం. కానీ సర్కారు జీవోలను కార్పొరేట్ స్కూల్స్ పట్టించుకోవడం లేదంటున్నారు పేరెంట్స్. ఇప్పటికే సగం ఫీజులు వసూలు చేశాయంటున్నారు.