కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు

కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు
  •     తెలంగాణ మాదిగ రిజర్వేషన్  పోరాట సంఘం 

బషీర్​బాగ్, వెలుగు :  బీఆర్ఎస్ సర్కార్ దళితులను మోసం చేసిందని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం ఆరోపించింది. అణగదొక్కాలని చూసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దళితులు బొందపెట్టారని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముల సంపత్ మాదిగ పేర్కొన్నారు. బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకుసాల సంపత్ నాయక్​తో కలిసి ఆయన మాట్లాడారు.

కొత్తగా ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డికు అభినందనలు తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దళితులకు దామాషా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

అదే విధంగా ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంట్​కు పంపించాలని కోరారు. కాంగ్రెస్ హామీలలో ఉన్న అంబేద్కర్ అభయ హస్తం పేరిట దళితులకు 12 లక్షలు అందిస్తే, వారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.