రెన్యువల్ కావాలంటే.. క్లాసులు వినాల్సిందే!.. వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్లకు లీవ్ ఎవరిస్తరని నర్సింగ్ ఆఫీసర్ల ఆవేదన

రెన్యువల్ కావాలంటే.. క్లాసులు వినాల్సిందే!.. వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్లకు లీవ్ ఎవరిస్తరని నర్సింగ్ ఆఫీసర్ల ఆవేదన
  •     నర్సులకు కౌన్సిల్ షాక్.. ఐదేండ్లకు150 గంటల క్రెడిట్ పాయింట్లు మస్ట్

హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ ఆఫీసర్లకు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ గట్టి షాకిచ్చింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలంటే కేవలం ఫీజు కడితే సరిపోదని, కచ్చితంగా సెమినార్లు, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లకు వెళ్లి క్రెడిట్ అవర్స్ సంపాదించుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) తెచ్చిన కొత్త రూల్ ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు150 గంటల శిక్షణ (75 క్రెడిట్ పాయింట్లు) తప్పనిసరి చేసింది. ఇందులో హాస్పిటల్ డ్యూటీలకు కొన్ని పాయింట్లు ఇచ్చినా.. మిగతావి కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ క్లాసులు, రీసెర్చ్ పేపర్ల ద్వారానే పొందాలి. 

ఈ నిర్ణయంతో సర్కార్ దవాఖానల్లో పనిచేసే నర్సులు తలలు పట్టుకుంటున్నారు. ‘‘అసలే హాస్పిటల్స్ లో పని భారం ఎక్కువ.. వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లకు వెళ్తామంటే మాకు లీవులు ఇవ్వరు.. పైగా కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల ఫీజుల భారం ఎవరు భరించాలి?’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెన్యువల్ గడువు దగ్గర పడ్డవాళ్లు ఇప్పుడు ఈ పాయింట్లు ఎట్లా తెచ్చుకోవాలని టెన్షన్ పడుతున్నారు. ఇబ్బందికరంగా ఉన్న ఈ రూల్ ను సడలించాలంటూ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.