అసెంబ్లీ భద్రతపై హై అలర్ట్

 అసెంబ్లీ భద్రతపై హై అలర్ట్

హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్​పై దాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ భద్రతపై హై అలర్ట్​ అయ్యింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. బుధవారం రాత్రి స్పీకర్ ​చాంబర్​లో మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ ​రెడ్డి, ప్రొటెం స్పీకర్​ అక్బరుద్దీన్​ఒవైసీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్​బాబు పోలీస్ ​ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

పార్లమెంట్​పై అగంతకుల దుశ్చర్యను వారు ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని పోలీస్​ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీకి వచ్చే వారిని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలన్నారు.