జమ్ముకాశ్మీర్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన భారత సైన్యం

జమ్ముకాశ్మీర్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన భారత సైన్యం

జమ్ముకశ్మీర్ లోని పూంచ్ లో ఉగ్రదాడి కలకలం రేపుతోంది. గురువారం (ఏప్రిల్ 20న) మధ్యాహ్నం ఆర్మీ ట్రక్కుపై జరిగిన గ్రెనేడ్ దాడిని ఉగ్రదాడిగా భారత సైన్యం నిర్ధారించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ ను రాజౌరిలోని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

బింభేర్‌ గలి నుంచి పూంఛ్‌ జిల్లాలోని సాంగియోట్‌ వైపు వెళ్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఏప్రిల్ 21న ఎన్ఐఏ అధికారుల బృందం వెళ్లనుంది.

భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న ఉగ్రవాదులు..మన సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఆర్మీ ట్రక్కుపై పిడుగుపడి.. జవాన్లు చనిపోయారని ముందుగా అనుకున్నారు. కానీ, అన్ని అనుమానాలు ఉండడంతో విచారణ మొదలుపెట్టడంతో అసలు విషయం బయటపడింది.

భారీ వర్షం కారణంగా భారత బలగాలు గుర్తించలేదు. ఆర్మీ ట్రక్కుపై జరిగిన గ్రెనేడ్ దాడి జరిగిందని భారత సైనికులు నిర్ధారించారు. గ్రెనేడ్ దాడి జరిగిన తర్వాత ట్రక్కులో పెద్ద ఎ్తతున మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఏప్రిల్ 20న మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. అయితే.. భారీ వర్షం కారణంగా భారత బలగాలు గుర్తించలేదు. 

ఇటీవల పంజాబ్‌లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే ఈ విషాదం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.