దశగ్రీవ.. రావణా

దశగ్రీవ.. రావణా

‘ధమాకా’ లాంటి మాస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ తర్వాత ‘రావణాసుర’ అనే థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. సుధీర్‌‌‌‌ వర్మ  డైరెక్ట్ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్‌‌‌‌, రవితేజ టీమ్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సోమవారం ‘రావణ యాంథమ్‌‌‌‌’ పేరుతో థీమ్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘దశగ్రీవ రావణ.. దశకంఠ.. లంకాధిపతి రావణ’ అంటూ సాగిన ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్ కంపోజ్ చేశాడు. రావణుడు రాసిన శివ తాండవ స్తోత్రంలోని కొన్ని వాక్యాలనే లిరిక్స్‌‌‌‌గా తీసుకున్నారు. హరికా నారాయణ్, పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్  పాడారు. ఎనర్జిటిక్‌‌‌‌గా ఉన్న ఈ పాటను పబ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో పిక్చరైజ్ చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్‌‌‌‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌‌‌‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌‌‌‌ ఫిమేల్ లీడ్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సుశాంత్‌‌‌‌ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. రావు రమేశ్‌‌‌‌, మురళీ శర్మ, సంపత్‌‌‌‌ రాజ్‌‌‌‌, నితిన్‌‌‌‌ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌‌‌‌ 7న విడుదల కానుంది.