గుడిలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

గుడిలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

మేడ్చల్ జిల్లా : పోచారం మున్సిపల్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. యంనంపేట గ్రామంలోని రంగనాయక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. గుడిలోని హుండీని ఎత్తుకెళ్లారు. నగదును దోచుకుని హుండీని చెట్ల పొదల్లో పడేసి పరారయ్యారు. గ్రామంలోని ఆలయంలో చోరీ జరగటం చర్చనీయాంశమైంది.