పిల్లలపై థర్డ్​వేవ్​ ఎఫెక్ట్​ తక్కువే

V6 Velugu Posted on Jun 17, 2021

  • 95% పిల్లలు ఇంట్లనే కోలుకుంటరు
  • లక్షణాలు పెద్దగా కనిపించవు
  • ఇతర జబ్బులుంటే జాగ్రత్త అవసరం
  • దీనిపై పేరెంట్స్​కు అవగాహన కల్పించాలె
  • గైడ్​లైన్స్ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • ఆస్పత్రుల్లో సౌలతులు పెంచుకోవాలని సూచన
  • పెద్దోళ్ల మందులు వాడొద్దని వార్నింగ్

కరోనా థర్డ్​ వేవ్​ ఎఫెక్ట్​ చిన్న పిల్లలపై తక్కువగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పౌష్టికాహార లోపంతో కానీ, ఇతర జబ్బులతో కానీ బాధపడుతున్న చిన్నారుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వైరస్​ బారినపడిన పిల్లల్లో నూటికి 95 మంది ఇంట్లనే కోలుకుంటారని, వీరిలో లక్షణాలు పెద్దగా కనిపించవని తెలిపింది. మరో 5 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరి ట్రీట్​మెంట్​ తీసుకోవాల్సి వస్తుందని,  
దీనికి తగ్గట్లు ఆస్పత్రుల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల్లో  సౌలతులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు థర్డ్​ వేవ్​పై బుధవారం గైడ్​లైన్స్ విడుదల చేసింది.

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: కరోనా థర్డ్ వేవ్‌‌ ఎఫెక్ట్ పిల్లలపై తక్కువే ఉంటుంద ని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. వైరస్​ బారిన పడిన చిన్నారులలో 95% మంది ఇంట్లనే కోలుకుంటరని చెప్పింది. వీరిలో చాలా మందిలో లక్షణాలు కనిపించకపోవడమో, చాలా తక్కువ స్థాయిలో కనిపించడమో జరుగుతుందని వివరించింది. ఇలాంటి కేసులకు ఇంట్లోనే ట్రీట్​మెంట్​అందిస్తే సరిపోతుందని తెలిపింది. ఈమేరకు కోవిడ్ సోకిన పిల్లల ఐసోలేషన్‌‌, ట్రీట్‌‌మెంట్‌‌, పోస్ట్ కోవిడ్ కేర్‌‌‌‌, హాస్పిటల్‌‌ ప్రిపరేషన్‌‌పై బుధవారం గైడ్‌‌లైన్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రాలు లాక్​డౌన్​ను ఎత్తివేస్తున్నాయని కేంద్రం గుర్తుచేసింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం వల్ల పిల్లల్లో కరోనా కేసులు పెరగొచ్చని పేర్కొంది. ఫస్ట్ వేవ్‌‌, సెకండ్‌‌ వేవ్‌‌లో 88% పెద్దవాళ్లు, 12% మంది పిల్లలు వైరస్ బారిన పడ్డారని.. థర్డ్ వేవ్‌‌లో ఈ లెక్కలో మార్పు రావొచ్చని తెలిపింది. తొలి రెండు వేవ్స్‌‌లో కోవిడ్ బారిన పడ్డ పిల్లల్లో 2% నుంచి 3% మంది మాత్రమే హాస్పిటళ్లలో చేరారని, థర్డ్‌‌ వేవ్‌‌లో ఇది 5% దాకా ఉండొచ్చని పేర్కొంది. ఇక, హాస్పిటళ్లలో చేరిన పిల్లల్లో  40% మందికి ఐసీయూ అవసరం పడొచ్చని చెబుతూ.. దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

పేరెంట్స్ కు అవగాహన కల్పించాలె
పౌష్టిక ఆహార లోపంతో బాధపడే పిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లపైనే కరోనా ప్రభావం ఎక్కువుంటుందని తెలిపింది. ఈ పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంది. కరోనా సోకిన పిల్లల్లో కనిపించే లక్షణాలు, మందుల వాడకం, ఆక్సిజన్, పల్స్‌‌రేట్‌‌, టెంపరేచర్ చెక్ చేయడం వంటి వాటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

పిల్లల్లో కరోనా లక్షణాలు ఇవే
కోవిడ్ సోకిన పిల్లల్లో కనిపించే లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సమస్య, గొంతు నొప్పి, డయేరియా, వాంతులు, అలసట, కండరాల నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఈ లక్షణాల తీవ్రతను బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ డిసీజ్‌‌గా విభజించి, అవసరమైన హాస్పిటల్‌‌కు పంపించాలి. పిల్లలకు సింప్టమ్స్ వస్తే వెంటనే టెస్టు చేయించాలి. పిల్లలున్న ఇంట్లో పెద్దవాళ్లకు కరోనా వస్తే, లక్షణాలు లేకున్నా పిల్లలకు టెస్ట్ చేపించాలి. పిల్లల్లో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పిల్లల తల్లిదండ్రులకు పల్స్ ఆక్సిమీటర్ ఇచ్చి పంపాలి. వెంటనే స్పందించేలా కాల్‌‌ సెంటర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులకు ఎమర్జన్సీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలి.

పెద్దోల్ల మందులు పిల్లలకు వాడొద్దు
పిల్లల కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఐవర్‌‌‌‌మెక్టిన్‌‌, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఫావిపిరవిర్‌‌‌‌, డాక్సిసైక్లిన్‌‌, అజిత్రోమైసిన్‌‌ వాడొద్దని ఆదేశించింది. ఈ మందుల ప్రయోగాలు పిల్లలపై జరగలేదని, అందువల్ల వాటిని ఉపయోగించడం కరెక్ట్ కాదని పేర్కొంది. కార్టికోస్టెరాయిడ్స్‌‌, రెమ్‌‌డెసివిర్ వంటివి చాలా సీరియస్‌‌ కేసుల్లో మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ట్రీట్‌‌మెంట్‌‌ ప్రోటోకాల్‌‌ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు పంపిస్తామని కేంద్రం పేర్కొంది.

Tagged corona vaccine, coronavirus, central health department, , corona effect on children, third wave on children, new guide lines for children

Latest Videos

Subscribe Now

More News