రాత్రి 7.30 నుంచే ధనాధన్‌?

రాత్రి 7.30 నుంచే ధనాధన్‌?

న్యూఢిల్లీ: ఈసారి ఐపీఎల్ మ్యాచ్ ల టైమింగ్ మారే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే నైట్ మ్యాచ్ ఓ అరగంట ముందుగా మొదలయ్యే చాన్స్ ఉంది. అంటే ఎనిమిది గంటలకు కాకుండా 7.30కే మ్యాచ్ స్టార్ట్ కానుంది. గతంలో ఉన్న 44 రోజుల విండోను ఈసారి 51 రోజులకు పొడిగించాలనే చర్చ కూడా నడుస్తున్నది. దీనివల్ల డబుల్ హెడర్ మ్యాచ్ ల‌ సంఖ్యను తగ్గించొచ్చనే ఆలోచన చేస్తున్నారు. అలాగే, సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 7మధ్య మెగా లీగ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

కానీ, బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ‌‌సూచన మేరకు సెప్టెంబర్ 19 నుంచే లీగ్ మొదలయ్యే అవకాశం ఉంది. శుక్ర లేదా శనివారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీట్లో దీనిపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. గవర్నింగ్ కౌన్సింగ్ చర్చించబోయే అంశాలు షెడ్యూల్, డేట్స్, ఫార్మాట్ ప్లేయర్ల‌కు, రాంచైజీలకు, బ్రాడ్ కాస్టర్స్కు, స్పాన్సర్ కు సంబంధించి స్టాండర్ ఆపరే డ్ టింగ్ ప్రొసిజర్ను రూపొందించడం. లాజిస్టిక్స్ పై చర్చ కమర్షియల్ ర్షి స్పాన్సర్షిప్, ఐపీఎల్ కు  చెందిన రెండు సెంట్రల్ స్పాన్సర్షిప్ ప్లేస్లు ఎంచుకోవడం. మ్యాచ్ టైమింగ్స్, ప్రొడక్షన్ ప్రొటో కాల్స్, షెడ్యూలింగ్ స్టార్ స్పోర్స్ ట్ తో చర్చ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో కలిసి లైజన్స్ ను ఏర్పాటు చేయడం.