రవి వర్మ, రోహిత్ బెహల్, అక్షత సోనవానె ప్రధాన పాత్రల్లో శంకర్ ముడావత్ రూపొందించిన చిత్రం ‘ప్రత్యర్థి’. సంజయ్ సాహ నిర్మాత. జనవరి 6న సినిమా విడుదల కానుండగా సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
ఎలాంటి పెద్ద కేసును అయినా చాలా తక్కువ టైమ్‌లో సాల్వ్ చేసే ఎస్‌ఐ.. ఓ చిన్న మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో చనిపోవడం పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్చర్యపరుస్తుంది. అతని ఇన్వెస్టిగేషన్‌లో తేలిన నిజాలేంటి.. ఎస్‌ఐని చంపిందెవరు, ఎందుకు చంపారనేది సస్పెన్స్. నమ్మిన వాళ్లకు ద్రోహం చేయడం చాలా ఈజీ సార్.. ఇప్పుడు ప్రతి మనిషి చేస్తోందదే’ అనే డైలాగ్ బాగుంది. ‘డిఫరెంట్ స్టోరీ లైన్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు దర్శకనిర్మాతలు.