Jharkhand train accident: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన రైలు.. 12మంది మృతి

Jharkhand train accident: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన రైలు.. 12మంది మృతి

Jamtara train accident: జార్ఖండ్లోని జమ్ తార వద్ద ఘో ర రైలు ప్రమాంద జరిగింది.  రైలు దిగి పట్టాలు రెండో లైన్ ట్రాక్ దాటుతుండగా ప్రయాణికులను బంగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. బుధవారం (ఫిబ్రవరి 28) కర్మతాండ్ లోని కల్ఘరియా సమీపంలో జరిగింది. 

భాగల్పూర్ వెళ్లే ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయని ఝరియా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకి దిగారు. అదే సమయంలో పక్క ట్రాక్ పై ఝఝూ నుంచి అసన్సోల్ వెళ్లే  ట్రైన్ వారిని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో 12 మంది వరకు మృతి చెందారని స్థానికంగా ఉన్నవారు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించలేదు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం సాయంత్రం వేళ జరగడంతో అక్కడ అంతా చీకటిగా ఉంది. చాలామందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. 

జమ్తారా రైలు ప్రమాదానికి కారణాలు ఇవే..

జార్ఖండ్ లోని జమ్తారా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విద్యాసాగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని కలాజారియా దగ్గర రైలు ఢీకొని 12 మంది ప్రయాణికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం. .బెంగళూరు యశంతాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు డౌన్ లైన్ లో వెళ్తుండగా.. లైన్ అంచున ఉన్న బ్యాలస్ట్ దుమ్ము ఎగరడంతో మంటలు చెలరేగాయని భావించిన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. అదే సమయంలో అప్ లైన్ లో వెళ్తున్న ఈఎంయూ రైలు ప్రయాణికులు ఢీకొట్టింది. దీంతో వారిలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 

ALSO READ :- ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్​ తోనే సాధ్యం: ఏపీ పీసీసీ చీఫ్​ షర్మిల