టీఆర్ఎస్ పార్టీకి 15 మంది కౌన్సిలర్ల అల్టిమేటం

టీఆర్ఎస్ పార్టీకి 15 మంది కౌన్సిలర్ల అల్టిమేటం

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము రాజీనామా చేస్తామంటూ టీఆర్ఎస్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. రెండేళ్లుగా మున్సిపాలిటీ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. చైర్ పర్సన్ అవినీతిపై ఎన్నో సార్లు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశామని, కానీ కలెక్టర్ పట్టించుకోలేదని వాపోయారు. చైర్ పర్సన్ తీరుతో పార్టీకి, కౌన్సిలర్లకు చెడ్డ పేరు వస్తోందని తెలిపారు.

తమను చైర్ పర్సన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే చైర్ పర్సన్ పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు.