ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సమావేశం

ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సమావేశం

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోమ్ శాఖ సమావేశం తేదీ ఖరారు చేసింది. ఏప్రిల్ 24న కేంద్రహోంశాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (సెంటర్ స్టేట్ రిలేషన్స్ విభాగం) జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఇరు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.