తెలుగు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్రజలశక్తిశాఖ భేటి

తెలుగు రాష్ట్రాల సీఎస్ లతో  కేంద్రజలశక్తిశాఖ భేటి


కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులకు సంబంధించిన గెజిట్ అమలుపై రంగంలోకి దిగింది కేంద్రం.  తెలుగు రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్   ద్వారా కేంద్ర జల శక్తి శాఖ సమావేశమైంది.. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ గత జూలై 15న గెజిట్ జారీ చేసింది. దీంతో ఉమ్మడి ప్రాజెక్టులనే తీసుకోవాలని తెలంగాణ పట్టబట్టింది. గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ స్వాధీనం చేసుకుంటేనే APలోకి ప్రాజెక్టులు అప్పగిస్తామని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. దీంతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఇవాళ రెండు రాష్ట్రాల సీఎస్ లతో చర్చించనున్నారు. ఇప్పటికే సమావేశానికి సంబంధించి చర్చించబోయే అంశాలపై కేంద్ర జలశక్తి మంతిత్వ్రశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్  రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్ కుమార్, సమీర్ శర్మలకు లేఖ రాశారు.