గో వీగన్ అంటే రోజూ కూరగాయలు, ఆకు కూరలే తినాల్సిన అవసరం లేదు. గ్రీన్ ఫుడ్ లో... అవకాడో, పాలకూర, బచ్చలి కూర, క్యాబేజీ, బ్రకోలీ, నిమ్మకాయ, ద్రాక్ష, కొత్తిమీర, కరివేపాకు, పుదీన, గ్రీన్ టీ వంటి రకాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న మూడు గ్రీన్ ఫుడ్స్ ఇవి...
బచ్చలి కూర, పాల కూర
ఓ కప్పు తాజా బచ్చలి కూరలో లేదా పాలకూరలో రోజూ వారీ మనకు అవసరమైన విటమిన్లు, మిన రల్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థని సెట్ చేస్తాయి. బీపీ కంట్రోల్ చేస్తాయి. ఎముకల్ని, గుండెను కాపాడతాయి. కంటికి మేలు చేస్తాయి. ఇమ్యూని టీ పవర్ పెంచుతాయి. కాబట్టి వారానికి రెండుసార్లయినా బచ్చలి కూర, పాలకూర తినాలి.
గ్రీన్ వెజిటబుల్స్:
గ్రీన్ యాపిల్స్: గ్రీన్ యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్, పొటాషియం ఎక్కువ. గ్రీన్ యాపిల్ ని చెక్కు తీయకుండా తినాలి.
కీరదోస:వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వీటిని ఎం డాకాలంలో ఎక్కువగా తినాలి. వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. రోజూ పొద్దున్నే కీరదోసకాయ ముక్కలు తినొచ్చు లేదా భోజనం తోపాటు తినేయొచ్చు.
►ALSO READ | ఫ్యామిలీ డే ఒకటుందని తెలుసా...? ఈరోజైనా ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి బాస్..!
అయితే పచ్చి కూరగాయలు తినటం పూర్తిగా మంచిదా అంటే కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలూ పచ్చిగా తినడం కరెక్ట్ కాదు డైజెషన్ సమస్యలు వస్తాయి. అందుకని ఇలాంటి డైట్ ఫాలో అవ్వాలనుకునే ముందు డాక్టర్ తో మాట్లాడాలి.
