బండి స్టార్ట్ కావాలంటే లైసెన్స్ ఉండాల్సిందే

బండి స్టార్ట్ కావాలంటే లైసెన్స్ ఉండాల్సిందే

సిరిసిల్లకు చెందిన బుధవారపు మల్లేశం కూకట్‌పల్లి జేఎన్​టీయూలో ఎలక్ర్టానిక్​ అండ్​ కమ్యూనికేషన్​లో బీటెక్​ పూర్తి చేశాడు. వెహికిల్స్‌ దొంగతనాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు​ ఒక డివైజ్‌ను కనుగొన్నాడు. అందులో స్కానింగ్​ మాడ్యూల్​, మైక్రో కంట్రోల్​ పోగ్రాంను ఇన్‌స్టాల్‌ చేశాడు. ఆర్​సీ కార్డు, లైసెన్స్‌ ఏదైనా ఒకటి స్కాన్​ చేస్తేనే వెహికిల్‌ స్టార్ట్​ అవుతుంది. లేదంటే బండి నడవడం కష్టమే. ఈ సిస్టంలో వైర్​లెస్​కార్డు స్కానింగ్​ మాడ్యూల్​ ఇంటిగ్రేడెట్​ సర్క్యూట్​ ద్వారా వెహికిల్స్‌ స్టార్ట్‌ అవుతాయి. అంటే ఆర్​సీ నంబర్​ లేదా లెసెన్స్​ నంబర్​తో లింక్‌ చేసిన కార్డును స్కాన్​ చేస్తేనే బండి స్టార్ట్‌​ అవుతుంది. ఈ టెక్నాలజీని ఈ మధ్యే సిరిసిల్ల పోలీస్​ స్టేషన్​లో ప్రయోగాత్మకంగా నిరూపించాడు మల్లేశం. గతంలో కూడా ఇలాంటి పలు ఆవిష్కరణలు చేశాడు. చిన్నపిల్లలను కాపాడే డివైజ్‌, ప్రమాదాలు నివారించే డివైజ్‌, ఆటోమెటిక్​గా వెలిగే స్ట్రీట్‌ లైట్స్ తయారుచేసి అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు.