వార్మప్ లేదు.. వర్షమే!

వార్మప్ లేదు.. వర్షమే!
  •     ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ రద్దు
  •     ఆసీస్​, నెదర్లాండ్స్​ పోరుకూ వాన అడ్డు
  •     మరో 4 రోజుల్లో వన్డే వరల్డ్​ కప్​

గువాహతి :  టీమిండియా తొలి వార్మప్​కు వాన అడ్డొచ్చింది. ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ మధ్య శనివారం జరగాల్సిన వార్మప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది.ఎడతెరపి లేకుండా కురిసిన వాన వల్ల ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. టాస్‌‌‌‌కు ముందు చిన్నగా మొదలైన వర్షం సాయంత్రం వరకు కూడా ఆగలేదు. దీంతో సాయంత్రం 6 గంటలకు గ్రౌండ్​ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌‌‌‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం తిరువనంతపురంలో జరిగే రెండో వార్మప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. నెదర్లాండ్స్‌‌‌‌తో తలపడుతుంది. సోమవారం ఇంగ్లండ్‌‌‌‌ ఇదే వేదికపై బంగ్లాదేశ్‌‌‌‌ను ఎదుర్కోనుంది. 

స్టార్క్‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌.. 

తిరువనంతపురంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌‌‌‌ మధ్య జరిగిన వార్మప్​లోనూ ఫలితం రాలేదు. వర్షం వల్ల 23 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌‌‌‌లో తొలుత ఆసీస్‌‌‌‌ 166/7 స్కోరు చేసింది. స్మిత్‌‌‌‌ (55), గ్రీన్‌‌‌‌ (34) రాణించారు. తర్వాత నెదర్లాండ్స్‌‌‌‌ 14.2 ఓవర్లలో 84/6 స్కోరు చేసింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్‌‌‌‌ను రద్దు చేశారు. ఆసీస్‌‌‌‌ పేసర్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (3/18) హ్యాట్రిక్‌‌‌‌తో చెలరేగాడు. తన ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌ ఆఖరి రెండు బాల్స్‌‌‌‌కు మాక్స్‌‌‌‌ ఓ డౌడ్‌‌‌‌ (0), వీస్లీ బారెసీ (0)ని, రెండో ఓవర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు బాస్‌‌‌‌ డి లీడె (0)ను డకౌట్‌‌‌‌ చేసి హ్యాట్రిక్​ సాధించాడు. అకెర్‌‌‌‌మన్‌‌‌‌ (31 నాటౌట్‌‌‌‌) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్​ తన రెండో వార్మప్​ను మంగళవారం హైదరాబాద్​లో పాకిస్తాన్​తో ఆడనుంది.