SIPలతో సంపద సృష్టికి వారెన్ బఫెట్ గైడెన్స్.. ఖచ్చితంగా లాభాలొస్తాయ్..!

SIPలతో సంపద సృష్టికి వారెన్ బఫెట్ గైడెన్స్.. ఖచ్చితంగా లాభాలొస్తాయ్..!

ప్రఖ్యాత పెట్టుబడిదారుడైన వారెన్ బఫెట్‌ భారతదేశంలో ఉంటే SIP ద్వారా పెట్టుబడులు పెట్టేవారేమో. SIP ద్వారా ప్రతీరోజూ లేదా నెలకి ఒక స్ధిరమైన మొత్తాన్ని పెట్టడం వల్ల దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ ప్రభావం వలన వ్యూహాత్మకంగా సంపద సృష్టించుకోవచ్చు. మార్కెట్లలో ఓలటాలిటీ సమయంలో ఆందోళన చెందకుండా.. క్రమం తప్పకుండా పెట్టుబడులను కొనసాగించడం ఎప్పుడూ ఉత్తమమని బఫెట్ భావించేవారు. అలాగే బఫెట్‌ తన పెట్టుబడుల్లో సమయాన్ని, నిరంతర పారదర్శకతను అత్యంత ముఖ్యంగా భావించారు. 

ఏడాదికి సగటు 12-14% రాబడులతో.. 10 సంవత్సరాలు నెలకు రూ.10వేలు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే.. రూ.25 లక్షలు అలాగే 20 ఏళ్లు కొనసాగిస్తే.. రూ. కోటి, 30 సంవత్సరాల్లో రూ.3.5 కోట్లు కూడబెట్టొచ్చు. 1979 నుంచి సెంసెక్స్‌ సూచీలో పెట్టుబడులు పెట్టి దానిని అలాగే కొనసాగించి ఉంటే రూ.లక్ష పెట్టుబడి విలువ ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం రూ.8 కోట్లు అయ్యేది.

2020లో కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా SIP మానకుండా కొనసాగించడం ద్వారా ఎక్కువ యూనిట్లు పొందారు తెలివైన ఇన్వెస్టర్లు. మార్కెట్ తిరిగి పెరిగిన సమయంలో ఇన్వెస్టర్లు మంచి లాభాలు పొందారు. బఫెట్‌ భావించినట్లు.. క్రమం తప్పకుండా పెట్టుబడులు కొనసాగించడం, భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదని, దీర్ఘకాల ధైర్యం మంచి రాబడులను తెచ్చిపెడతాయని కరోనా సమయంలో మార్కెట్లలో లాభాలు పొందిన పెట్టుబడిదారులను చూస్తే నిజమేనని అర్థం అవుతుంది.

►ALSO READ | పాకిస్తాన్‌లో ఐఫోన్ 17 సిరీస్ ధర షాకింగ్.. ఇండియాతో పోల్చితే ఇంత తక్కువకేనా...!

అందుకే ఉన్న కొద్ది డబ్బును ప్రతి నెల SIPగా పెట్టుకుంటూ ఓపికతో పాటు సమయాన్ని నమ్ముతూ ఇన్వెస్టర్లు ముందుకెళ్లాలి. అది సమయానుకూలంగా పెద్ద సంపదగా మారుతుంది. దీని ద్వారా మార్కెట్ టైమింగ్ గురించి టెన్షన్ తీసుకోకుండా.. క్రమం తప్పకుండా డబ్బును పెట్టడం ద్వారా సంపద సృష్టి సాధ్యమేనని నిపుణులు చెప్పే మాట అక్షరాలా నిజమేనని తేలిపోయింది. SIP ద్వారా నెలకు ఒక స్థిరమైన మొత్తం పెట్టడం, దీర్ఘకాలంలో కాంపౌండింగ్ వల్ల పెట్టుబడి భారీగా పెరుగుతుంది. ఈ విధానంలో తక్కువ సంపాదన కలిగిన వ్యక్తులు కూడా సులభంగా సంపద సృష్టించవచ్చు.