
కొద్దిరోజుల క్రితం అమెరికన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఆపిల్ కొత్తగా ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ సిరీస్ ఫోన్లు ఇప్పుడు పాకిస్తాన్‌లో అమ్మకానికి రాగా... వీటి ధరలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ 17 బేస్ మోడల్ పాకిస్తానీ రూపాయిల్లో PKR 3.25 లక్షల నుండి ప్రారంభమై, ప్రో మాక్స్ మోడల్ ధర PKR 7.48 లక్షల వరకు ఉంది. దీని బట్టి చూస్తే ఇండియాలో వీటి ధరలు చాల తక్కువగా ఉన్నాయి, అలాగే రెండు దేశాల మధ్య ధరల తేడా ఎంతగా ఉందొ అర్ధమవుతుంది.
పాకిస్తాన్‌లో ఐఫోన్ 17 సిరీస్ ధరలు: పాకిస్తాన్‌లో ఐఫోన్ 17 సిరీస్ ధర చాలా ఎక్కువ. ఆపిల్ పాకిస్తాన్ వెబ్‌సైట్ ప్రకారం, ఐఫోన్ 17 మోడల్ ధర PKR 325,000(రూ.1,02,399) నుండి PKR 445,500(రూ.1,40,366) వరకు... ఐఫోన్ 17 ఎయిర్ ధర PKR 398,500(రూ.1,25,557) నుండి PKR 536,500(రూ.1,69,038) వరకు.... ఐఫోన్ 17 ప్రో ధర PKR 440,500(రూ.1,38,790) నుండి PKR 748,500(రూ.2,35,834) వరకు... అయితే అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడల్ ధర PKR 573,999(రూ.1,80,853) వరకు ఉంది.
ఇండియాలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు: పాకిస్థాన్ తో పోల్చితే భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ ధర చాలా తక్కువ. ఐఫోన్ 17 బేస్ వేరియంట్ రూ.82,900 (256GB) నుండి ప్రారంభమై రూ.1,02,900 (512GB) వరకు ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్ ధరలు రూ.1,19,900 (256GB) నుండి రూ.1,59,900 (1TB) వరకు ఉంది. ఐఫోన్ 17 ప్రో రూ.1,34,900 (256GB) నుండి ప్రారంభమై రూ.1,74,900 (1TB) వరకు ఉంటుంది.
రెండు దేశాల ధరల్లో తేడా: ధరలు పోల్చి చూస్తే, పాకిస్తాన్‌లో ఐఫోన్ 17 సిరీస్ ధరలు భారతదేశంలో కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు, ఐఫోన్ 17 ప్రో బేస్ వేరియంట్ ధర భారతదేశంలో రూ.1,34,900 అయితే పాకిస్తాన్‌లో దీని ప్రారంభ ధర సుమారు PKR 4,40,500 (రూ.1,37,000). ప్రో మాక్స్ మోడల్ ధర కూడా PKR 5,73,999 (రూ.1.77 లక్షలు) కంటే ఎక్కువ, ఇది భారతదేశం కంటే చాలా ఎక్కువ.
►ALSO READ | ట్రంప్ చెప్పేదొకటి చేసేదొకటి.. ఆయన హయాంలో ఇండియాను ఎలా టార్గెట్ చేసాడో చూడండి..!
ఇండియాలో ఐఫోన్ 17 రూ.82,900 (256GB) నుండి రూ.1,02,900 (512GB), పాకిస్థాన్లో రూ.1,02,399 నుండి రూ.1,40,366
ఐఫోన్ 17 ఎయిర్ రూ.1,19,900 (256GB) నుండి రూ.1,59,900 (1TB), పాకిస్థాన్లో రూ.1,25,557 నుండి రూ.1,69,038
ఐఫోన్ 17 ప్రో రూ.1,34,900 (256GB) నుండి రూ.1,74,900 (1TB), పాకిస్థాన్లో రూ.1,38,790 నుండి రూ.2,35,834
ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ.1,49,900 (256GB) నుండి రూ.2,29,900 (2TB), పాకిస్థాన్లో రూ.1,80,853 (ప్రారంభ ధర)
డెలివరీ & కలర్ అప్షన్స్ : ఐఫోన్ 17 సిరీస్ డెలివరీలకు 2-4 వారాలు పట్టవచ్చని ఆపిల్ పాకిస్తాన్ వెబ్‌సైట్ పేర్కొంది అలాగే ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయి. ఈ ఫోన్‌లు లావెండర్, సేజ్, మిస్ట్ బ్లూ, వైట్, బ్లాక్, స్కై బ్లూ, లైట్ గోల్డ్, స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, డీప్ బ్లూ, కాస్మిక్ ఆరెంజ్ వంటి చాల కలర్ అప్షన్స్ ఉన్నాయి.