తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని 'ది వారియర్' ప్రూవ్ చేసింది

తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని 'ది వారియర్' ప్రూవ్ చేసింది

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. కృతి శెట్టి కథానాయికగా ఆది పినిశెట్టి విలన్ గా తెరకెక్కిన ఈ మూవీకి తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.  

ఉస్తాద్ రామ్ మాట్లాడుతూ ''సినిమా విడుదల సమయంలో చాలా అడ్డంకులొచ్చాయని.. లాస్ట్ మినిట్ డిజిటల్ ప్రింట్స్ కు వెళ్ళే వరకూ ఏదో ఒక అడ్డొస్తూనే ఉందని హీరో రామ్ అన్నారు. ఆ సమయంలో మా టీమ్ అంతా వారియర్స్‌లా నిలబడ్డారని... ఫైనల్ గా రిలీజ్ చేశారన్నారు. అదే పెద్ద సక్సెస్ అనుకున్నాన్న రామ్.. . తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని 'ది వారియర్' మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పారు. 'పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో... అలా ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించిందని దర్శకుడు లింగుస్వా అన్నారు. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నానన్న ఆయన.. తమిళంలో విజయ్, అజిత్ లాంటి మాస్ హీరోలకు ఎలాంటి క్రౌడ్ వస్తుందో... అటువంటి మాస్ క్రౌడ్ మధ్య ఈ సినిమా చూశానన్నారు. 

పోలీస్ లో ఉన్న పర్ఫెక్షన్ ను రామ్ బాగా క్యారీ చేశారని.. ఆయనతో నటించడం బావుందని నటి కృతి శెట్టి అన్నారు. గురు పాత్రలో ఆది పినిశెట్టిని తప్ప ఇంకొకరిని ఊహించలేమన్న బ్యూటీ కృతి... లింగుస్వామి గారి దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.గురు గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం గురు లింగుస్వామి అని నటుడు  ఆది పినిశెట్టి చెప్పారు. బ్రదర్ రామ్, కృతి... అందరితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్‌'' అని అన్నారు. వీరితో పాటు ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, ఫైట్ మాస్టర్ విజయ్, కళా దర్శకుడు డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.